English | Telugu

ఎన్టీఆర్ ‘టెంపర్‌’ చూపించాడు

పూరి జగన్నాథ్‌, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘టెంపర్‌’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ‘టెంపర్‌’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైపోయింది. ఈ రోజు బెనిఫిట్‌ షోస్‌ పడిపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన ఉదయం ఏడు గంటలకే బయటకు వచ్చింది. అయితే ఎన్టీఆర్ గత చిత్రాలతో పోలిస్తే సినిమా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం ఎన్టీఆర్ అని చెబుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్టైలింగ్ అన్ని కొత్త ఎన్టీఆర్ చూస్తున్నట్టు వుంటుందట. అలాగే కాజల్ గ్లామర్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటున్నారు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ ఏ రెంజులో నిలబెట్టే చిత్రమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.