English | Telugu

అభిమానుల దండయాత్ర

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్‌’ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో సినీ అభిమానులు కూడా తమ ‘టెంపర్‌’ని చూపిస్తున్నారు. 'టెంపర్’ షో ఆలస్యంగా వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తిరుపతిలోని జయశ్యాం థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. ‘టెంపర్’ చిత్రాన్ని అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని డిమాండ్ చేసినా థియేటర్ యాజమాన్యం నిరాకరించడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో జయశ్యాం థియేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది.