English | Telugu

టెంప‌ర్‌ రివ్యూ రిపోర్ట్ : ఎన్టీఆర్‌ విశ్వరూపం!

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం కష్టపడుతున్న ఎన్టీఆర్, టెంప‌ర్‌ లో తన నట విశ్వరూపం చూపించాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. పూరి ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు టెంప‌ర్‌ లో విలన్, హీరో, కామెడియన్, చివరికి ఐటెం కూడా ఎన్టీయారే అయి సినిమాను నడిపించాడట. ఎన్టీఆర్ మారాడు అనే వారికి ఈ సినిమా సమాధానం చెబుతుందని అంటున్నారు. ఇక టెంప‌ర్‌ సినిమా విషయానికి వస్తే ఫస్ట్‌ హాఫ్‌ ఒకే నని, సెకండాఫ్‌ లో ఎన్టీఆర్ దగ్గరనుంచి పూరి, అనూప్ అందరూ తమ సత్తా చూపించారట. ఎన్టీఆర్ నట విశ్వరూపం సెకండాఫ్‌ లో కనిపిస్తుందట. ముఖ్యంగా కోర్ట్ సీన్ లో చెప్పే డైలాగ్, అతని ఎక్స్‌ప్రెషన్‌ గొప్ప నటుడుకి నిదర్శనం అంటున్నారు. పోసాని కృష్ణమురళి కూడా మంచి క్యారెక్టర్ పడిందని చెబుతున్నారు. అలాగే కాజల్ గ్లామర్ సినిమా ప్లస్ పాయింట్...మొత్తానికి టెంప‌ర్‌ తో ఎన్టీఆర్ ఫామ్ లోకి రావడం ఖాయమంటున్నారు. ఏ రేంజ్‌కి వెళుతుందనేది అన్ని వర్గాల ప్రేక్షకుల స్పందనపై డిపెండ్‌ అవుతుందట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.