English | Telugu
పవర్ స్టార్ కోసం పాట పాడిన ఎన్టీఆర్
Updated : Mar 8, 2016
ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఒక పాట పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాట ద్వారా తానెంత మంచి సింగరో ఎన్టీఆర్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. గెలయా గెలయా అంటూ సాగే పాటలో, ఎన్టీఆర్ ఎనర్జీ అంతా కనిపిస్తోంది. పునీత్ 25వ సినిమాగా వస్తున్న చక్రవ్యూహలోని ఈ పాటకు ఇప్పుడు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్, శాండల్ వుడ్ ప్రేక్షకులు ఈ సాంగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ పాట విని మురిసిపోతున్నారు. కాగా, ఎన్టీఆర్ తన 25వ సినిమా నాన్నకు ప్రేమతో లో కూడా పాట పాడటం విశేషం. చక్రవ్యూహకు తమన్ సంగీత సారథ్యం వహించారు. ఇలా స్టార్ హీరోలు పరస్పరం గౌరవించుకోవడం, ఇండస్ట్రీలకు చాలా మంచి పరిణామం అంటున్నారు సినీ జనాలు.