English | Telugu
వర్మ దేవుడినే క్షమిస్తాడట..!
Updated : Mar 8, 2016
మహిళా దినోత్సవానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పారు వర్మ. ఎప్పటిలాగే తన ఆయుధమైన ట్విట్టర్లో, మహిళా లోకానికి, విమెన్స్ డే విషెస్ చెప్పారు వర్మ. కానీ ఆయన చెప్పిన తీరే విభిన్నంగా ఉంది. నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పను. ఎందుకంటే, మహిళలు అన్ని రోజులూ హ్యాపీగానే ఉండాలి. వాళ్లను ఏదో ఒక్కరోజుకు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం చాలా తప్పు అంటూ పాజిటివ్ గానే ట్వీట్ చేసిన వర్మ, వెంటనే దేవుడిపై పడ్డారు. దేవుడు సృష్టించిన వాటిలో, అత్యంత అందమైనది ఆడజాతి. అందుకే టెర్రరిస్టులు, బొద్దింకలు లాంటి అసహ్యమైన వాటిని సృష్టించినా, దేవుడిని క్షమించేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఎదేమైనా వర్మ శైలే వేరు అంటున్నారు నెటిజన్లు.