English | Telugu

ఎన్టీఆర్ 'రభస' రివ్యూస్ రిపోర్ట్

గత కొన్ని సంత్సరాలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాకు తగ్గ హిట్ కొట్టలేకపోతున్నాడు. కానీ రభసతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అతని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన రభస గురించి సినీ విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం. ‘రభస’ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాత్రం ఈ సినిమా సేఫ్ రూట్ ఎంచుకున్నకానీ పకడ్బందీ కథనాన్ని నడిపించడంలో విఫలమయ్యాడని అంటున్నారు. అలాగే అతను రాసిన డైలాగులు పేలవంగా వున్నాయట. ఇక ఈసినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఒక్కడే మొత్తం భారాన్ని మోశాడని, కొత్త బాడీ లాంగ్వేజ్ తో హీరోయిన్లపై సెటైర్లు వేస్తూ యూత్ ని కొద్దిసేపు అలరి౦చాడట. సెకండాఫ్ లో బ్రహ్మానందం లేటుగా ఎంట్రీ ఇచ్చినా కానీ రావడం రావడంతోనే డ్యూటీ ఎక్కేస్తాడట. ఈ ఫిలింని తన ట్రేడ్‌ మార్కు కామెడీతో గట్టెక్కించాడట. ఓవరాల్ గా చూసుకుంటే జనాన్ని థియేటర్‌కి రాబట్టడానికి, చివరి వరకు కూర్చోబెట్టడానికి ఎన్టీఆర్, బ్రహ్మానందంలే తప్ప ఏమి లేదని అంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.