English | Telugu

అక్టోబర్ 17న ఎన్టీఆర్ రభస

ఇటీవలే ఎన్టీఆర్ నటించిన "రామయ్యా వస్తావయ్యా" చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన తరువాతి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఎన్‌.టి.ఆర్‌. హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రభస". ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యుల్ ను అక్టోబర్ 17న ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత మూడోసారి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.