English | Telugu
'రభస'కి ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ఎస్సెట్
Updated : Aug 29, 2014
ఆది సినిమాతో ఎన్టీఆర్ కెరీర్‌కు తొలి సూపర్ హిట్ అందించిన బ్యానర్ మళ్ళీ ఇన్నేళ్ళకు అతనితో నిర్మించిన భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రభస'. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా టాక్ విషయానికి వస్తే మాస్ ఆడియన్స్ మాత్రమే సంతృప్తి పడేలా ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ చూడ్డానికి వచ్చిన వారు మాత్రం డిజప్పాయింట్ కారని అంటున్నారు. సెకండాఫ్ లో బ్రహ్మానందం లేటుగా ఎంట్రీ ఇచ్చినా కానీ తన ట్రేడ్ మార్కు కామెడీతో అలరి౦చాడట. థమన్ సంగీతం రాకాసి రాకాసి పాట ఒక్కటే బాగుందట. ఫైట్స్ ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌గా మారాయని చెబుతున్నారు. సంతోష్ శ్రీనివాస్ రాసిన డైలాగులు, కథ, కథనం పేలవంగా వున్నాయట. మొత్తానికి యంగ్ టైగర్ మాత్రమే ఈ రొటీన్ సినిమాకి అతి పెద్ద బలమట!