English | Telugu
ఇంటర్వెల్ సీన్ కోసం 3 కోట్లు..!
Updated : Aug 14, 2014
జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ మూవీ గురించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉండే ఈ చేజింగ్ అండ్ ఫైటింగ్ ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని సమాచారమ్. తన ప్రతి సినిమాలో స్పెషల్‌సాంగ్‌కి కొత్తమ్మాయిని తీసుకునే పూరి, ఈసినిమా ఐటెం సాంగ్ కోసం సల్మాన్‌ఖాన్ మాజీ ప్రియురాలు ఝరైనిఖాన్‌ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.