English | Telugu
ఎన్టీఆర్ సినిమా ఆగిపోయింది
Updated : Oct 20, 2014
పాపం.. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ సినిమాకి ఏమీ కలసి రావడం లేదు. ఈ సినిమా మొదలైనప్పటినుంచి వరుస ఆటంకాలు ఎదురవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా గోవా షెడ్యూల్ వాయిదా పడినట్లు సమాచారం. చిత్రసీమలో సమ్మె సైరన్ మోగుతోంది. కార్మికులు సహాయ నిరాకరణ ప్రకటించారు. దాంతో ఎన్టీఆర్ షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేం. జనవరి 9న ఈ సినిమాని కచ్చితంగా విడుదల చేస్తామని బండ్ల గణేష్ కూడా ధీమాగా చెబుతున్నాడు. కానీ ఈ సినిమా చిత్రీకరణ స్పీడ్ చూస్తే సంక్రాంతికి రావడం డౌటే అని అంటున్నారు.