English | Telugu
అన్నపూర్ణ కాంపౌండ్‌లో మారుతి?
Updated : Oct 20, 2014
రాత్రికి రాత్రే క్రేజ్ తెచ్చేసుకొన్న దర్శకుల్లో మారుతి ఒకడు. బూతు సినిమాలే తీసినా... డబ్బులొచ్చాయ్ కాబట్టి మారుతితో సినిమాలు చేయడానికి నిర్మాతలు వరుసకట్టారు. నీ పేరు వాడుకొంటాం చాలు... అని వెనుక తిరిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. మారుతి బ్రాండ్ వేసుకొని వచ్చిన సినిమాలు కొన్నున్నాయి కూడా. అయితే ఈ బూతు బ్రాండ్ మారుతికి ఎంత ప్లస్ అయ్యిందో, అంతే మైనస్ అయ్యింది. మారుతితో సినిమాలు చేయడానికి ఓ మాదిరి హీరో కూడా జంకుతున్నాడు. మొన్నామధ్య సునీల్‌తో సినిమా అనుకొన్నారు. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరవాత నాని పేరు పరిశీలనలోకి వచ్చింది. అదీ ఇంత వరకూ అజాపజా లేదు. ఇప్పుడు లేటెస్టుగా మనోడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. నాగచైతన్యకు ఓ కథ చెప్పి ఒప్పించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడని టాలీవుడ్ టాక్. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని సమాచారమ్. మరి నాగచైతన్య అయినా ఓకే చేస్తాడా?? లేదంటే మారుతి పేరు చెప్పగానే భయపడి పారిపోతాడా?? అనేది తేలాలి.