English | Telugu
త్రిష మళ్లీ రొమాన్స్ మొదలెట్టింది
Updated : Oct 20, 2014
ప్రేమ వ్యవహారాల్లో తరచూ త్రిష పేరు కూడా వినిపిస్తుంటుంది. ధనుష్‌తో త్రిష కాస్త క్లోజ్‌గానే మూవ్ అయ్యింది. ఆ తరవాత రానా - త్రిషల మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోందని చిత్రసీమ కోడై కూసింది. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగడం, ఫొటో షూట్‌లకు ప్రత్యేకంగా పోజులివ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతానికి త్రిష ఒంటరిగానే ఉంటోంది. అయితే... ఈమధ్య మరో హీరోని తగులుకోందని తమిళ చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనెవరో కాదు.. రజనీకాంత్ అల్లుడు ధనుష్. త్రిషతో అతనికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అయితే ఈమధ్య ఇది కాస్త హద్దులు దాటుతోందని, దానికి త్రిష దూకుడే కారణమని చెన్నైలో చెప్పుకొంటున్నారు. దీన్ని బలపరుస్తూ ఈమధ్య కొన్ని ఫొటోలూ బయటకు వచ్చాయి. ఓ పార్టీలో త్రిష, ధనుష్ చాలా క్లోజ్ గా ఉండడం కనిపించింది. ఆ ఫొటోలిప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే త్రిష మాత్రం ఎప్పట్లా.. ''ధనుష్ నాకు ఫ్రెండ్ మాత్రమే'' అంటోంది. మరి నమ్మొచ్చంటారా??