English | Telugu
రామయ్యను థ్రిల్ చేసిన సుకుమార్
Updated : Aug 5, 2013
మహేష్ బాబుతో "1-నేనొక్కడినే" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగానే సుకుమార్ మరో చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ కు సుకుమార్ ఓ కథ వినిపించడంట. ఆ కథ విని ఎన్టీఆర్ చాలా థ్రిల్ ఫీలయ్యాడని తెలిసింది. దాంతో ఎన్టీఆర్ వెంటనే సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహేష్ బాబుతో "1-నేనొక్కడినే" చిత్ర షూటింగ్ లో సుకుమార్, "రామయ్యా వస్తావయ్యా" చిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ లు బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.