English | Telugu
27నే 'నాన్నకు ప్రేమతో' ఆడియో
Updated : Dec 24, 2015
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. వాయిదా పడిందని అనుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా జనవరి 13నే రిలీజ్ కాబోతుందట. ముందు నుండి చెబుతున్నట్లే డిసెంబర్ 27నే ఘనంగా నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ చేయడానికి ఒక ఈవెంట్ కంపెనీకి నిర్మాత ఆర్డర్ కూడా ఇచ్చేసాడట. ఈ సినిమా ఆడియోను దేవిశ్రీ నాన్న గారు దివంగత సత్యమూర్తి కి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఆడియో ఫంక్షన్ లో ఈ సినిమా రిలీజ్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ సంక్రాంతి రేసులో వున్నట్టే!!