English | Telugu
‘బాహుబలి’కి భలే గౌరవం
Updated : Dec 23, 2015
రాజమౌళి దర్శకత్వంలో రూపొంది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ది ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు మహేష్‌భట్ ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని అభినందిస్తూ మంగళవారం ఓ ప్రశంసా పత్రాన్ని జారీ చేశారు. ఈ ధ్రువపత్రంలో ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచిందని పేర్కొన్నారు. భారీ ప్రమాణాలతో భారతీయ సినిమా విలువలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినందుకు అభినందించారు. మహేష్ భట్ పంపిన ప్రశంసా పత్రాన్ని ‘బాహుబలి’ టీమ్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.