English | Telugu

Mrs Deshpande Review: మిస్సెస్ దేశ్ పాండే వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: మిస్సెస్ దేశ్ పాండే
తారాగణం: మాధురి దీక్షిత్, సిద్ధార్థ్ చందేకర్, ప్రియాన్షు ఛటర్జీ, దీక్షా జునేజా తదితరులు
ఎడిటింగ్: టపాస్ శంకర్
సినిమాటోగ్రఫీ: సంగ్రమ్ గిరి
మ్యూజిక్: టపాస్ రెలియా
నిర్మాతలు: రూపా దేశాయ్, ఇలాహె హిప్టూలా
దర్శకత్వం: నగేశ్ కుకునూర్
ఓటీటీ: జియో హాట్ స్టార్

కథ:
ముంబైలోని ఒక ఇంట్లో నైలాన్ రోప్ తో దారుణంగా ఒక మనిషిని గొంతు నులిమి చంపేస్తాడు కిల్లర్. అలా సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దాంతో ముంబై సిటీ కమీషనర్ అరుణ్ ఖత్రి (ప్రియాన్షు ఛటర్జీ).. ఈ కిల్లర్ ను పట్టుకునే భాద్యతను అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి తేజస్(సిద్ధార్థ్ చందేకర్)కి అప్పగిస్తాడు. తేజస్, తన్వీ(దీక్షా జునేజా) కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే ఈ వరుస హత్యలు అంతకముందు మిస్సెస్ దేశ్ పాండే(మాధురి దీక్షిత్) చేసేది. తను వేరే సిటీలోని సెంట్రల్ జైలులో ఉంటుంది. అందుకే తనని వేరొక ఇంటికి తీసుకొని వచ్చి తన సహాయం తీసుకుంటాడు కమీషనర్ అరుణ్ ఖత్రి. ఇక అప్పటి నుండి మిస్సెస్ దేశ్ పాండే, తేజస్ టీమ్ కలిసి సీరియల్ కిల్లర్ ని పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతడిని తేజస్ అండ్ మిస్సెస్ దేశ్ పాండే టీమ్ పట్టుకున్నారా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. (Mrs Deshpande web series Review)

విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉంటుంది. మొదటి ఎపిసోడ్ (టేక్స్ వన్ టూ క్యాచ్ వన్): ఇందులో సెంట్రల్ జైలులో ఉన్న మిస్సెస్ దేశ్ పాండేని మరొక ఇంటికి మార్చి హంతకుడుని పట్టుకోవాలని ముంబై కమీషనర్ చెప్తాడు. రెండో ఎపిసోడ్(ది సీక్రెట్ లెటర్స్): ఈ ఎపిసోడ్ లో ఒక క్రిమినల్ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్ళగా అక్కడ వాష్ రూమ్ లో ఓ కవర్ లో లెటర్స్ ఉంటాయి. అవి తీసి చూసిన తేజస్ కి మిస్సెస్ దేశ్ పాండే మీద అనుమానం కలుగుతుంది. ఇక మూడో ఎపిసోడ్ (ట్రూత్ ఇన్ వర్డ్స్): తేజస్ కి నిజం చెప్పడానికి మిస్సెస్ దేశ్ పాండే ప్రయత్నిస్తుంది కానీ తనని ఇంకా ఖైదీలానే చూస్తాడు.

నాల్గో ఎపిసోడ్ ( ఏ కిల్లర్ ఈజ్ బార్న్): ఇందులో అలెక్స్, తేజస్ కలుస్తారు. అయిదో ఎపిసోడ్ (శిష్య): మిస్సెస్ దేశ్ పాండే తన తెలివితేటలతో అతనెవరో కనిపెట్టే ఎపిసోడ్ ఇది. ఆరో ఎపిసోడ్(ది ఫైనల్ జడ్జ్ మెంట్): ఇందులో అసలు క్రిమినల్ ఎవరు.. దానికి గల కారణాలు.. మిస్సెస్ దేశ్ పాండే గతం.. ఇలా అన్నీ రివీల్ అయ్యే ఎపిసోడ్.

ఇక ఈ సిరీస్ లో ప్రతీ ఎపిసోడ్ యాభై నిమిషాల పైనే ఉంటుంది. మనం సిరీస్ చూసేప్పుడు 1.24x లేదా 1.5x స్పీడ్ తో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే అంత ల్యాగ్ ఉంటుంది. ప్రతీ విషయం క్షుణ్ణంగా వివరించే ప్రయత్నంలో భాగంగా చాలా స్లోగా సాగుతుంది. కథ బాగున్నప్పటికి ఇంత స్లో స్క్రీన్ ప్లే అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది.

సీరియల్ కిల్లర్ ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చే ట్విస్ట్ లు బాగుంటాయి. అయితే ఈ సిరీస్ లో అసలు కిల్లర్ ఎవరు.. ఎందుకు ఇదంతా చేశారో తెలుసుకోవాలంటే నాలుగు గంటల ఎపిసోడ్ లు చూడాలి. ఇంత సేపు ఓ కిల్లర్ ఎవరో తెలుసుకోవాలనే ఓపిక ఎవరికి ఉంటుంది. అది రెగ్యులర్ గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని చూసే ఆడియన్స్ కి మాత్రమే ఉంటుంది.

అయితే ఈ సిరీస్ ప్లాట్ బాగుంటుంది. కానీ దీనిని నాలుగు ఎపిసోడ్ లకు కుదించి.. ప్రతీ ఎపిసోడ్ ని ఇరవై నుండి ముప్పై ఎపిసోడ్ లకి కుదించొచ్చు. కానీ దర్శకుడు క్రైమ్ ని, క్రిమినల్ ని, అతని గతాన్ని డీటేయిలింగ్ చెప్పడం కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.

ఈ తరహా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి. కానీ అవి కాస్త బెటర్‌ ఎందుకంటే ఇందులో ఇంటెన్స్ లేదు ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లేదు. కిల్లర్ ఎవరో తెలిసినా అతడి తాలుకా గతాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు.

స్లోగా సాగే ఎపిసోడ్స్ ఆడియన్ ని చివరి వరకు కూర్చోబెట్టలేవు. కానీ ఎంచుకున్న కథ బాగుంది. క్యారెక్టర్లు డిజైన్ కొత్తగా ఉంది. ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు. అశ్లీల దృశ్యాలు లేవు.

నటీనటుల పనితీరు:
మిస్సెస్ దేశ్ పాండేగా మాధురి దీక్షిత్, తేజస్ గా సిద్ధార్థ్ చందేకర్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు.

ఫైనల్ గా..
స్లోగా సాగినా.. వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్: 2/5

✍️. దాసరి మల్లేశ్

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.