English | Telugu
'యంగ్ టైగర్' 'కింగ్' కాంబినేషన్ కి టైముంది.!
Updated : Aug 28, 2014
టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం సోలో హీరోగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఆయన కొత్త పాత్రలపై దృష్టిపెట్టబోతున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తున్నాడని సమాచారం.. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాతో నాగార్జున కొత్తగా కనిపిస్తాడని టాలీవుడ్ టాక్. కాకపోతే ఈ చిత్రం మొదలు కావడానికి ఇంకా టైమ్ పడుతుందట. అప్పటివరకు ఖాళీగా వుండడం ఎందుకని నాగార్జున ఓ కొత్త దర్శకుడికి ఓకే చెప్పారట. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో పి. రామ్ మోహన్ దీనిని నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.