English | Telugu

యాక్షన్‌ నుంచి రొమాంటిక్‌ కామెడీకి.. అట్లీతో ఎన్టీఆర్‌ సినిమా!

ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చూపించే దేవర కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌, కొరటాల శివ దేవరతో మరోసారి మ్యాజిక్‌ చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో తొలిసారి దేవరతో ఓ సిరీస్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందిన దేవర చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించింది.

ఇదిలా ఉంటే.. తమిళ వెర్షన్‌కి సంబంధించి ఎన్టీఆర్‌ చేస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా అక్కడి మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు ఎన్టీఆర్‌. తన కెరీర్‌లో ఇప్పటివరకు తెలుగు డైరెక్టర్స్‌తో తప్ప మరో భాషకు చెందినవారితో సినిమా చెయ్యని ఎన్టీఆర్‌ తొలిసారి కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా కన్‌ఫర్మ్‌ చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇప్పుడు తమిళ్‌ డైరెక్టర్స్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తనకు వెట్రిమారన్‌తో ఓ సినిమా చెయ్యాలని ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు, రాజారాణి, జవాన్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌ని రూపొందించిన అట్లీతో ఓ సినిమా కోసం చర్చలు కూడా జరిపినట్లు తెలియజేశారు.

అట్లీకి గొప్ప టాలెంట్‌ ఉందని, అతను చేసిన రాజారాణి తనకు చాలా ఇష్టమని, ఆ సినిమాను తెరకెక్కించిన విధానం బాగా నచ్చిందని చెప్పారు. తనతో సినిమా చెయ్యాలనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్‌ రొమాంటిక్‌ కామెడీ స్టోరీ లైన్‌ చెప్పాడని, ఆ కథ గురించి ఇద్దరం చర్చించుకున్నామన్నారు. అయితే ఇద్దరం వరస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్‌ మెటీరియలైజ్‌ అవ్వలేదని అన్నారు. అట్లీ కాంబినేషన్‌లో తప్పకుండా సినిమా ఉంటుందని కన్‌ఫర్మ్‌ చేశారు ఎన్టీఆర్‌. షారూక్‌ఖాన్‌తో అట్లీ చేసిన జవాన్‌ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ వంటి యాక్షన్‌ హీరోతో రొమాంటిక్‌ కామెడీ మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతో నావెల్టీ వుండి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఎన్టీఆర్‌, అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమాను ఎక్స్‌పెక్ట్‌ చెయ్యొచ్చు అనేది స్పష్టమవుతోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.