English | Telugu

రూ.50 కోట్ల క‌బ్ల్‌... ఎన్టీఆర్ కి సాధ్య‌మేనా??

బాలీవుడ్‌లో వంద కోట్ల క్ల‌బ్ స‌ర్వ‌సాధార‌మైపోయింది. ఓ మాదిరి సినిమా కూడా తొలి రెండు మూడు రోజుల్లో వంద కోట్ల మైలు రాయిని చేరుకొని జెండా ఎగ‌రేస్తోంది. బాలీవుడ్ సినిమాకి అంత‌ర్జాతీయంగా మార్కెట్ ఉంటుంది కాబ‌ట్టి వంద కోట్లు పెద్ద విష‌యం ఏమీ కాదు. బాలీవుడ్ లొ వంద కోట్లు ఎలానో, టాలీవుడ్‌లో రూ.50 కోట్ల క్ల‌బ్ కూడా అంతే. రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, బాల‌కృష్ణ‌... వీళ్లంద‌రూ రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయారు. మిగిలింది ఎన్టీఆర్ ఒక్క‌డే. బాద్ షా ఈ మైలు రాయికి ఇంచుమించు ద‌గ్గ‌ర‌గా వెళ్లింది. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్‌ని మూట‌గ‌ట్టుకోవ‌డంతో రూ.30 కోట్లు కూడా ద‌క్కించుకోలేదు. టెంప‌ర్‌తో ఆ ఆశ నెర‌వేరుతుంద‌ని భావించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తొలి రోజే హిట్ టాక్ రావ‌డంతో ఈ సినిమా కనీసం రూ.70 కోట్లు సాధిస్తుంద‌ని లెక్క‌లు వేసుకొన్నారు. తీరా చూస్తే ఇప్పుడు రూ.50 కోట్ల మైలు రాయిని చేరుకోవ‌డం కూడా క‌ష్ట‌త‌రంగా మారింది. రెండో రోజు నుంచీ వ‌సూళ్లు అనూహ్యంగా ప‌డిపోయాయి. ఆది వారం కూడా అంతంత మాత్ర‌మే వ‌సూలు చేసింది. మొత్త‌మ్మీద ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.28 కోట్ల షేర్ సాధించింద‌ని అంచ‌నా. ఆ లెక్క‌న ఈ సినిమా రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుందా??అనే అనుమానాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాకి దాదాపుగా రూ.45 కోట్లు (వడ్డీల‌తో క‌లుపుకొని) అయ్యింది. క‌నీసం ఈ డ‌బ్బులొచ్చినా అదే ప‌ది వేలు అనుకొంటోంది చిత్ర‌బృందం. శాటిలైట్ రూ.7.5 కోట్ల‌కు అమ్ముడుపోయింది. అదే.. లాభం అనుకోవాలి. కుటుంబ ప్రేక్ష‌కులు ఈ సినిమాకి దూరం అవ్వ‌డం, రిపీటెడ్ ఆడియ‌న్స్ లేకపోవ‌డం టెంప‌ర్‌కి శాపంగా మారింది. ఇక ఈ సినిమా రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరాలంటే ఎన్టీఆర్ అభిమానులే పూనుకోవాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...