English | Telugu
ఎన్టీఆర్‌కి మహేష్ ఫోన్??
Updated : Feb 18, 2015
టాలీవుడ్ అంతా టెంపర్ మానియా పాకేసింది. ఈ సినిమాని అభిమానులే కాదు, సెలబ్రెటీలూ తెగ చూసేస్తున్నారు, కాంప్లిమెంట్లు అందించేస్తున్నారు. మొన్న దాసరి నారాయణరావు టెంపర్‌ని ప్రత్యేకంగా వీక్షించారు. 'నా వారసుడు పూరినే' అని కితాబిచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. మహేష్ కీ ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. ''పూరి.. సూపర్బ్‌గా తీశావ్, సినిమా అద్భుతంగా ఉంది'' అంటూ పూరికి కాంప్లిమెంట్లు అందించాడు మహేష్. అంతేకాదు.. ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడాడట. ''నీ పెర్ ఫార్మ్సెన్స్ మైండ్ బ్లోయింగ్..'' అంటూ మెచ్చుకొన్నాడట. పూరి - మహేష్ లు ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేశారు. హ్యాట్రిక్ మూవీ త్వరలో అంటూ ఆమధ్య మీడియాలో ప్రచారం బాగా జరిగింది. అయితే పూరి ఫామ్‌లో లేకపోవడం వల్ల హ్యాట్రిక్ మూవీ సంగతి లైట్ గా తీసుకొన్నాడు మహేష్. టెంపర్ చూశాక.. తన అభిప్రాయం మార్చుకొని ఉంటాడేమో మరి.