English | Telugu

తనకు ఇండియా అనే పేరు చాలంటున్న జాతీయ అవార్డు గ్రహీత

ఇటీవలి కాలంలో మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలనే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ తన వరకు ఇండియా అనే పేరు చాలు అని, భారత్‌ అని పేరు మార్చినా ఇండియా అనే పిలుస్తారని, ఇది తన అభిప్రాయం మాత్రమేనని అన్నారు. అలాగే ఇటీవల జాతీయ అవార్డులపై చాలా మంది రకరకాల వ్యాఖ్యలు చేశారు. దానిపై వెట్రిమారన్‌ స్పందిస్తూ ‘ఒక సినిమాని జాతీయ అవార్డుల కోసం పంపిస్తున్నామంటే సెలక్షన్‌ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే అంగీకారంతోనే పంపిస్తున్నాం. సెలెక్షన్‌ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? వారు ఎలాంటి వారు? సినిమాల ఎంపిక సక్రమంగా జరిగిందా? అనేది తర్వాత సంగతి. ఈ విషయంలో అవార్డుల కమిటీదే తుది నిర్ణయంగా ఉంటుంది. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరికి అవార్డులు ఇచ్చినా దాన్ని మనం గౌరవించాలి. ఒక సినిమా క్వాలిటీ ఎలా వుంది, ఆ సినిమా సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంశాలను సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోవడం లేదు
2007లో మొదలైన వెట్రిమారన్‌ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించారు. వాటిలో అవార్డులు పొందిన సినిమాలే ఎక్కువ. ప్రస్తుతం ‘విడుతలై’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు వెట్రిమారన్‌. ఈ సినిమా తర్వాత తెలుగులో ఓ సినిమా చేసే ఆలోచన అతనికి ఉందని సమాచారం. ‘విడుతలై’ పూర్తి కాగానే టాలీవుడ్‌లో వెట్రి చేసే సినిమాకి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.