English | Telugu

నిఖిల్ హ్యాట్రిక్ కొట్టేసేలానే ఉన్నాడు

హ్య‌పీడేస్ తో వ‌చ్చిన ఇమేజ్‌నీ, క్రేజ్ నీ కాపాడుకోలేక కొంత కాలం ఫ్లాపుల్ని మోశాడు నిఖిల్‌. ఆ త‌ర‌వాత రూటు మార్చి కాన్సెట్ క‌థ‌ల బాట ప‌ట్టాడు. ఇది బాగానే వ‌ర్కవుట్ అయ్యేలా క‌నిపిస్తోంది. స్వామిరారా, కార్తికేయ‌లు హిట్ట‌వ్వ‌డంతో నిఖిల్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. అత‌ని సినిమా అంటే మార్కెట్‌లో ఉత్సాహం పెరిగింది. అన్నో ఇన్నో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. తాజాగా సూర్య వెర్స‌స్ సూర్య కూడా ఆక‌ట్టుకొంటోంది. ఈసినిమా పాట‌లు, ప్ర‌చార చిత్రాలు విడుద‌లయ్యాయి. ఓవ‌రాల్‌గా చూస్తే కొత్త‌ద‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమా కూడా హిట్ట‌యితే... నిఖిల్ హ్యాట్రిక్ కొట్టేసిన‌ట్టే. అన్న‌ట్టు సూర్య వెర్స‌స్ సూర్య ఆడియో వేడుక ఆదివారం హైద‌రాబాద్ లోని తాజ్ డెక్క‌న్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఓ పెద్ద హీరో సినిమాకి ఎంత ఆర్భాటం చేస్తారో, ఈ సినిమాకీ అంతే హంగామా చేశారు. ఈ సినిమా బిజినెస్ ప‌రంగానూ మంచి క్రేజ్ సంపాదించింది. విడుద‌ల‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకొంది. చిన్న సినిమాకి అంత‌కంటే ఏం కావాలి..?? హీరోగా నిఖిల్ రేంజ్ పెర‌గ‌డానికి ఈ సూర్య కూడా హెల్ప్ చేసేలానే ఉన్నాడు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.