English | Telugu
బండ్ల గణేష్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్??
Updated : Feb 17, 2015
టెంపర్ ఇచ్చిన విజయానందంలో ఉన్నాడు... బండ్ల గణేష్. ఈసినిమాతో చావో రేవో అనుకొంటున్న సమయంలో భారీ ఓపెనింగ్స్.... గణేష్‌కి ఊరట కలిగించాయి. అదే ఉత్సాహంలో ఓ వెబ్ సైట్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి ఏదేదో మాట్లాడేశాడు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయేదని, తనని మెగా క్యాంప్ వ్యక్తి అనుకొన్నారని, పూరి, ఎన్టీఆర్‌తో తనకు కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని, చివరకు అన్నీ సర్దుకొన్నాయని చెప్పాడు. అంతే కాదు... పీవీపీ చెప్పిన 18 కరెక్షన్లతో పూరి ఈ సినిమాని ట్రిమ్ చేశాడని.. కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేశాడు. ఆ ఇంట్వర్యూ కొంతమంది నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. సినిమా ఇమేజ్‌ని దెబ్బతీసేలా మాట్లాడాడని ఫైర్ అయ్యారు. ఈ విషయం ఎన్టీఆర్‌కీ తెలిసింది. దాంతో ఆయనా... గణేష్ ని క్లాస్ పీకారని సమాచారం. సినిమా రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడట. దాంతో గణేష్ ఆత్మరక్షణలో పడ్డాడు. ''నేనింత వరకూ ఏ బెబ్ సైట్‌కీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అవన్నీ నమ్మొద్దు'' అని ట్వీట్ చేశాడు. ఇంటర్వ్యూ అంతా బోగస్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనతో మరోసారి బండ్ల గణేష్ - ఎన్టీఆర్ లమధ్య కమ్యునికేషన్ గ్యాప్ ఏర్పడే ప్రమాదం వచ్చింది. గణేష్ వాగేయడం ఎందుకు.. ఆ తరవాత ఇలా ఇబ్బందుల్లో పడడం ఎందుకు...???