English | Telugu

టెంప‌ర్ బ‌డ్జెట్ ఎంత‌??

ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో తొలిసారి రూ.50 కోట్ల మైలు రాయికి చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని ఎన్టీఆర్ అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. తొలి మూడు రోజుల‌కూ రూ.18 కోట్ల‌కు పైనే వ‌సూలు చేసింది టెంప‌ర్‌. ఈ జోరు మ‌రో వారం కొన‌సాగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ర‌మార‌మీగా ఈ సినిమా రూ.40 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయొచ్చు. త‌దుప‌రి సినిమాలేం బాగోక‌పోతే, ఎన్టీఆర్ మానియా రోజు రోజుకీ పెరిగితే త‌ప్ప రూ.50 కోట్లు కొల్ల‌గొట్ట‌డం సాధ్యం కాదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఎన్టీఆర్ సినిమా రూ.40 కోట్లు చేసినా.. హిట్టుకిందే లెక్క‌. అయితే టెంప‌ర్ బ‌డ్జెట్ ఎంత‌? ఈ సినిమాకి ఎంత ఖ‌ర్చ‌య్యింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది టాలీవుడ్‌లో. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాలు చూసినా, పూరి సినిమాలు చూసినా అందులో భారీద‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించేవి. భారీ ఛేజ్లూ, సెట్లూ చూసేవాళ్లం. టెంప‌ర్‌లో మాత్రం.. అవేం క‌నిపించ‌లేదు. వీలైనంత త‌క్కువ బడ్జెట్‌లో ఈ సినిమాని పూర్త‌చేయాల‌ని భావించింది చిత్ర‌బృందం. అయినా స‌రే.. ఈ సినిమాకి దాదాపుగా రూ.40 కోట్లు ఖ‌ర్చ‌యింది అంటున్నాడు బండ్ల గ‌ణేష్‌. వ‌డ్డీలతో క‌లుపుకొని దాదాపుగా రూ.43 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌ట‌. అంటే టెంప‌ర్ టార్గెట్ రూ.43 కోట్లు. ఈ మార్క్‌ని చేరుకొంటే సినిమా లాభాల్లో ప‌డిన‌ట్టే. ఎందుకంటే.. శాటిలైట్ రూపంలో ఇప్ప‌టికే రూ.7.5 కోట్లు అందాయి. సో.. టెంప‌ర్ రూ.40 కోట్ల మార్క్ చేరినా గ‌ణేష్ హ్యాపీనే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.