English | Telugu

ఇతడే ఆ రౌడీ ఫెల్లో...!

నారా రోహిత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి "రౌడీ ఫెల్లో" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం ద్వారా పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో రోహిత్ సరసన విశాఖ సింగ్, నందిని రాయ్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. చక్రి చిగురుపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి సన్నీ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.