English | Telugu
నా మహారాణిగా "నయనే" కావాలి..!
Updated : Apr 18, 2016
నందమూరి నటసింహం 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణీ. బాలయ్యకి కెరిర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలబెట్టేందుకు దర్శక, నిర్మాతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకే అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. సినిమా పనులన్నీ వూపందుకుని ఇక సెట్స్‌పైకి వెళ్లడమే లేటు అనుకుంటున్న టైంలో హీరొయిన్ విషయంలో చిక్కొచ్చిపడింది. మొదట నయనతారని హీరొయిన్‌గా ఎంచుకోవాలనుకున్నారు. కానీ కాల్షిట్లు లేకపోవడంతో నయన్ నో చెప్పింది. దీంతో యువరాణి కాజల్ వైపు దృష్టిపెట్టారు. ఆమె చేతిలో సినిమాలేవి లేవు కాబట్టి ఒప్పుకుంటుందని ఊహించారంతా. కానీ తనకు హీరొయిన్‌గా జీవితాన్నిచ్చిన గురువు తేజ కాల్షీట్లు అడిగేటప్పటికి ఆయనకి కాల్షీట్లు ఇచ్చేసింది కాజల్.
ఇక మిగిలింది ఒక్క అనుష్క మాత్రమే. క్రిష్‌తో ఇప్పటికే వేదం సినిమా చేసిన అనుష్కను చిత్రబృందం కలిసింది. ఆమె వైపు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాలయ్య వంక పెట్టాడు. అనుష్కకీ తనకీ సెట్టవ్వదనీ కెమిస్ట్రీ కుదరకపోవచ్చని నాకు నయనతారే కావాలని సింహా స్ట్రోక్ ఇచ్చాడంట. కథ మళ్లీ మొదటికి రావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో క్రిష్ ఉన్నాడట. మరి నయనతార కాల్షీట్లు సర్దుబాటు చేస్తుందా? లేక కాజల్‌ని మరోసారి ట్రై చేసి యోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.