English | Telugu
రోజాని, నాగబాబుని విడదీస్తారా..?
Updated : Apr 18, 2016
ఆ... ఆగండి..ఆగండి అసలు మీరు ఊహాల్లోకి వెళ్లి..ఏదేదో అనుకోకండి. అసలు విషయం ఏంటంటే ప్రతి గురు, శుక్ర వారాల్లో జబర్దస్త్..ఖతర్నాక్ కామెడీ షో అంటూ తెలుగువారిని నవ్విస్తున్న షో జబర్దస్త్. ఈ షోకి మెగా బ్రదర్ నాగబాబు, అలనాటి హీరోయిన్, ప్రస్తుత ఎమ్మెల్యే రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. స్టేజ్ మీద ఆర్టిస్ట్‌లతో సమానంగా వీరిద్దరూ పంచ్‌లు విసురుతూ షోకి అందాన్ని..క్రేజ్‌ని తీసుకొచ్చారు. అయితే ఈ జంటను విడదీసేందుకు రంగం సిద్ధమవుతుందని టాక్.
రోజాని తప్పించాలని ప్రోడ్యూసర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. త్వరలోనే ఈమె స్థానంలోకి మరో క్రేజీ హీరోయిన్‌ని రీప్లేస్ చేస్తారని తెలుస్తోంది. కొత్త జడ్జ్‌గా రాబోయే హీరోయిన్ పేరు కానీ రోజాను తప్పించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. అసెంబ్లీలో సస్పెన్షన్ వివాదంతో పాటు రాజకీయ వేత్తగా, నటిగా బిజీగా ఉండటంతో ఆమె షోకి సమయాన్ని కేటాయించలేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మరి జబర్దస్త్‌పై రోజా నవ్వుల్ని మిస్ అవుతామేమోనని ఆడియాన్న్ ఫీల్ అవుతున్నారు.