English | Telugu
రహస్యాలు మాట్లాడుతున్న బాలయ్య
Updated : Mar 5, 2016
ఈ మధ్య బాలయ్య మాటల్లో అంతరార్ధం ఎవరికీ అర్ధం కావట్లేదు. ఏం అడిగినా, చాలా నర్మగర్భంగా సమాధానాలు చెబుతున్నారు. మొన్నటికి మొన్న లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలుస్తారా అని అడిగితే, నేను ఎవరిని పిలవాలో వారినే పిలుస్తాను. ఎవరినీ నెత్తికెక్కించుకోను. గ్లామర్ ఉన్నవాళ్లు చాలా మంది వస్తున్నారు. నేను డిక్టేటర్ పంథాలోనే వెళ్తాను అంటూ సమాధానం ఇచ్చారు. అసలు ప్రశ్నకు పొంతనే లేని ఆ జవాబును విని, జర్నలిస్టులందరూ షాక్ అయ్యారు. కొంతమందైతే అది చిరును ఉద్దేశించి కాదని, వేరే నందమూరి హీరోకు వేసిన పంచ్ అని గుసగుసలాడుకున్నారు.
లేటెస్ట్ గా సావిత్ర ఆడియో ఫంక్షన్లో నారారోహిత్ ను పొగుడుతూ తర్వాత పూర్తిగా డీవియేట్ అయిపోయారు బాలయ్య. యాక్టింగ్ అంటే నవ్వడమే ఏడవటమో కాదు అంటూనే కొంత మంది గతజన్మలో చేసిన పాపాలు అనుభవించడానికి పుడతారు. చాలా తక్కువమంది మాత్రమే నాన్నగారిలా కారణజన్ములుంటారు అంటూ చెలరేగిపోయారు. కానీ ఆయన మాటల్లోని అంతరార్ధమేంటో, ఎవరిని ఉద్దేశించి అన్నారో అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఆ కొంతమంది ఎవరు..? వారి సంగతి ఆడియో ఫంక్షన్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది..?
అసలు బాలయ్య బాబు ఎందుకు ఇలా నిగూడార్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు..? ఆయన ఎవరికి ఇన్ డైరెక్ట్ గా చురకలు వేస్తున్నారు..? ఆయన ఇన్ డైరెక్ట్ స్పీచ్ ల వెనుక అంతరార్ధమేంటి..? ఏమో..ఆయనకే తెలియాలి మరి..