English | Telugu
ఆండ్రాయిడు సంపూ అదుర్స్ గురూ
Updated : Mar 5, 2016
కేవలం ఫేస్ బుక్ లో సరదాగా పోస్టులు పెడుతూ, స్టిల్స్ తో ప్యారడీగా అభిమానులన్ని సంపాదించుకున్నాడు సంపూ. అక్కడి నుంచి హృదయకాలేయం సినిమా రావడం, అది సూపర్ హిట్ అవడం జరిగిపోయాయి. దెబ్బకి సంపూ ఫేట్ టర్న్ అయిపోయింది. వరస సినిమాలతో, మంచి రేంజ్ కు చేరుకుంటున్నాడు. తాజగా కొబ్బరి మట్ట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సంపూ. ఈ సినిమాలో పాపారాయుడు,పెదరాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్ర్లల్లో సంపూ కనపడబోతున్నాడట. అందుకే ప్రమోషన్లో భాగంగా, ఒక్కో స్టిల్ ను విడుదల చేస్తున్నారు సినిమా టీం. లేటెస్ట్ గా దింపిన ఆండ్రాయిడు స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పెద్ద హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఈ డిజైన్ ఉండటం విశేషం.