English | Telugu
చిరు పాటను రీమిక్స్ చేస్తున్న పవన్
Updated : Mar 4, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వస్తోంది. ఇప్పటికే శరవేగంగా, చివరి దశకు షూటింగ్ ను తీసుకొచ్చిన పవర్ స్టార్, ఇప్పుడు తన అన్నయ్య పాటకు స్టెప్పులేయ్యనున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో సర్దార్ సెట్ నుంచి, ఐటం సాంగ్ కు డాన్స్ చేస్తున్న రాయ్ లక్ష్మి, పవన్ ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే. ఆ ఐటెం సాంగే చిరు పాత పాటకు రీమిక్స్ అని అంటున్నారు. ఈ సాంగ్ లో రాయ్ లక్ష్మితో కలిసి పవన్ అలరించబోతున్నాడట.
ఇంతకూ ఏ పాట అనేదేగా మీ డౌట్. కొండవీటి రాజా సినిమాలోని నా కోక బాగుందా పాటనే, ఇప్పుడు సర్దార్ లో రీమిక్స్ చేయబోతున్నారట. అప్పటి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ రీమిక్స్ చేస్తున్నాడు. ఒక వేళ ఈ వార్తలు నిజమైతే, మెగాఫ్యాన్స్ కు పండగే. ఇప్పటి వరకూ తన సినిమాల్లో, అన్నయ్య పాటలేవీ వాడుకోని తమ్ముడు ఈసారి వాడుతున్నాడో లేదో తెలియాలంటే, కొంత కాలం ఆగాల్సిందే మరి..