English | Telugu
దేవి అదరగొడుతున్నాడు...!
Updated : Sep 3, 2013
నాగార్జున హీరోగా ప్రముఖ దర్శకుడు వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "భాయ్". దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి దేవి అదిరిపోయే సాంగ్స్ తో పాటు, అదిరిపోయే రి-రికార్డింగ్ కూడా చేస్తున్నట్లు దర్శకుడు వీరభద్రం తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ సాంగ్ చిత్రీకరణ అవగానే, నాగ్ "మనం" షూటింగ్ లో పాల్గొననున్నాడు. సెప్టెంబర్ మూడో వారంలో ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి సన్నహలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.