English | Telugu

చక్రి అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్టలోని హిందూ స్మశాన వాటికలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. చక్రి అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసం వద్ద నుంచి ప్రారంభమైంది. అంతిమయాత్రలో అభిమానులు, బంధువులు పాల్గోని చక్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం రాత్రి ఆయనకు గుండెపోటు రాగా.. అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.


చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంభాలపల్లిలో జన్మించాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన ‘బాచి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, గోపి గోపిక గోదావరి, దేశముదురు, సింహా లాంటి మ్యూజికల్ హిట్స్‌కు సంగీతాన్నందించాడు. చిరంజీవి, వెంకటేష్ మినహాయిస్తే అందరు టాప్ స్టార్స్‌తోనూ సినిమాలు చేశాడు. చక్రి చివరి సినిమా ‘ఎర్రబస్సు’. గత నెలలోనే ఈ సినిమా విడుదలైంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.