English | Telugu

మంచు మనోజ్ కుమార్ మిస్టర్ నోకియా ఫస్ట్ లుక్

మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" ఫస్ట్ లుక్ ఇలా ఉంటుందని ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై, యువ న్యాచురల్ హీరో మంచు మనోజ్ కుమార్ హీరోగా, అని (అనిల్ కృష్ణ) దర్శకత్వంలో, డి.యస్.రావు (దమ్మాలపాటి శ్రీనివాసరావు) నిర్మిస్తున్న చిత్రం" మిస్టర్ నోకియా". ఒక విభిన్నమైన కథతో మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమా నిర్మించబడుతూంది. మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు.

మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" మూవీలో హీరో మంచు మనోజ్ కుమార్ గెటప్ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ మీడియాకు విడుదల చేశారు. రేపు మనోజ్ కుమార్ జన్మదినం సందర్భంగా మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమా యూనిట్ ఈ పోస్టర్ ని విడుదల చేసింది. మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమాకు "నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్" అనే క్యాప్షన్ ని నిర్ణయించారు. తెలుగువన్ మంచు మనోజ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...