English | Telugu

మంచు మనోజ్ పెళ్ళి ఖాయమైందట

మంచు మనోజ్ పెళ్ళి ఖాయమైందట...అని ఆయన సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యాదాత, రాజకీయనాయకుడు అయిన కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబు కనిష్ట కుమారుడు, ప్రముఖ యువ హీరో మంచు మనోజ్ కుమార్ త్వరలో పెళ్ళి కొడుకవబోతున్నాడు. గుంటూరుకు చెందిన ఒక తెలుగు దేశం పార్టీ నాయకుడి కుమార్తెను మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడట. పెళ్ళి కూతురు ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతూంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.

ఈ విషయం గురించి మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ " మా తమ్ముడు మనోజ్ పెళ్ళి ఫిక్స్ అయ్యింది.ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. రెండు కుటుంబాలూ ఈ విషయంలో చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాము. పెళ్ళి బహుశా వచ్చే సంవత్సరం జరుగుతుంది" అని అన్నారు. పెళ్ళి కూతురు పేరు ఎందుకనో రహస్యంగా ఉంచారు. మనోజ్ ప్రస్తుతం "మిస్టర్ నోకియా", "ఊ కొడతారా...? ఉలిక్కిపడతారా...?" అనే సినిమాల్లో నటిస్తున్నాడు. మనోజ్ పెళ్ళికి ఈ రెండు సినిమాలూ రిలీజవుతాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.