English | Telugu
ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీలు బెస్ట్ అంటున్న ఆడియన్స్!
Updated : Aug 4, 2025
ఆగస్ట్ నెలలో పలు భాషలకు చెందిన సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే సినిమాలు అంతగా లేవు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా 9న అతడు చిత్రాన్ని రీరిలీజ్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే టీవీల్లో మోత మోగించిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక థియేటర్‌లో చూసేందుకు ఏమీ లేకపోవడం వల్ల ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. ఈ వారం కూడా అన్నింటి కంటే నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువ సినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయి. మరి ఈ వారం వివిధ ఓటీటీ సంస్థల్లో స్ట్రీమ్ అయ్యే సినిమాలేమిటో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
ఎస్‌ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్)..ఆగస్టు 05
టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్).. ఆగస్టు 05
వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్).. ఆగస్టు 06
ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ).. ఆగస్టు 08
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా).. ఆగస్టు 08
మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ).. ఆగస్టు 10
హాట్‌స్టార్:
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో).. ఆగస్టు 04
పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా).. ఆగస్టు 05
లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ).. ఆగస్టు 07
మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా).. ఆగస్టు 07
సలకార్ (హిందీ సిరీస్).. ఆగస్టు 08
జీ5:
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్).. ఆగస్టు 08
మామన్ (తమిళ మూవీ).. ఆగస్టు 08
జరన్ (మరాఠీ సినిమా).. ఆగస్టు 08
లయన్స్ గేట్ ప్లే:
ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ).. ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్).. ఆగస్టు 08
అమెజాన్ ప్రైమ్:
అరేబియా కడలి (తెలుగు సిరీస్).. ఆగస్టు 08
సోనీ లివ్:
మయసభ (తెలుగు సిరీస్).. ఆగస్టు 07
సన్ నెక్స్ట్:
హెబ్బులి కట్ (కన్నడ సినిమా).. ఆగస్టు 08
ఆపిల్ ప్లస్ టీవీ:
ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్).. ఆగస్టు 06
ఎమ్‌ఎక్స్ ప్లేయర్:
బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్).. ఆగస్టు 08
సైనా ప్లే:
నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా).. ఆగస్టు 08