English | Telugu
దా...వుడా, ఆ డైరెక్ట్ రా....!
Updated : May 12, 2014
కలెక్షన్ లు కురిపించడం లో రేస్ గుర్రంలా దూసుకెళ్ళే బన్నీ సినిమాలు ఎంచుకోవడంలో ఎప్పుడు మిస్టర్ పర్ఫెక్టే. రీసెంట్ గా రేస్ గుర్రం సినిమాతో మంచి హిట్ సాధించిన ఈ హీరో ఒక కొత్త సినిమాకు ఓకే చెప్పేశాడు. గంగోత్రి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ హీరో ఇప్పటి వరకు అందరు పెద్ద, హిట్ డైరెక్టర్లతోనే పని చేశాడు అని చెప్పాలి. రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, సుకుమార్, సురేందర్ వంటి డైరెక్టర్ లతో మంచి హిట్ లు పొందిన ఈ ఎనర్జీ స్టార్ ఇప్పుడు ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. సిద్దార్థ్, శృతి హాసన్ కలిసి నటించిన ఓహ్ మై ఫ్రెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ల పడిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ లో టాలెంట్ కి కొదవ లేదని, ఆ నమ్మకంతోనే ఆయనతో సినిమా చేయటానికి అల్లు అర్జున్ సిద్డమయ్యారని తెలుస్తోంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.అందుకే కాబోలు హీరో గారు డైరెక్టర్ ఫ్లాప్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. డైరెక్టర్ ఎలా ఉన్నా, ప్రొడ్యూసర్ సూపర్ హిట్ అని ఓకే అనేసి ఉంటారు.