English | Telugu

ఇప్పుడు మరింత కొత్తగా ‘మిరాయ్‌’.. సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ వచ్చేసింది!

తేజ సజ్జ, కార్తీక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ మూవీ ‘మిరాయ్‌’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రిలీజ్‌కి ముందే ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని క్రియేట్‌ చేసిన ఈ సినిమా అందరి అంచనాలకు రీచ్‌ అయింది. ‘హనుమాన్‌’ తర్వాత తేజ సజ్జ కెరీర్‌లో మరో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలుస్తోంది. వీకెండ్‌తో సంబంధం లేకుండా అన్ని రోజులూ కలెక్షన్స్‌ రాబడుతున్న ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో హీరోతో సమానంగా మంచు మనోజ్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసిన విధానం అందరికీ నచ్చింది. దానికి తగ్గట్టుగానే పెర్‌ఫార్మెన్స్‌ ఉండడంతో అతనికి మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ఇక హరి గౌర సాంగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

లీజ్‌కి ముందే ఈ సినిమాలోని ‘వైబ్‌..’ సాంగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఈ పాట సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్‌ చాలా నిరాశకు లోనయ్యారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అయినప్పటికీ ఆ పాట లేని లోటు ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారు. దీంతో మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేక్షకులు, తేజ అభిమానులు. ఈ పాటను యాడ్‌ చెయ్యాలనే డిమాండ్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 23 నుంచి అన్ని సెంటర్స్‌లో ఈ పాటను జత చేశారు. ఈ పాట కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇది సంతోషాన్ని కలిగించే విషయమే. ఈ పాట కోసమే ఈ సినిమాకు రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 134 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన ‘మిరాయ్‌’.. లాంగ్‌ రన్‌లో ఎలాంటి ఫిగర్స్‌ని రీచ్‌ అవుతుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.