English | Telugu

షాక్ ల మీద షాక్ లు.. ఓజీ షోలు క్యాన్సిల్!

నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకి బిగ్ షాక్ తగిలింది. కెనడాలోని మేజర్ చైన్స్ లో ఒకటైన యార్క్ సినిమాస్.. ఓజీ చిత్రాన్ని ప్రదర్శించబోమని ప్రకటించింది. అంతేకాదు, నార్త్ అమెరికాలో ఓజీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది. (They Call Him OG)

"ఓజీ చిత్రానికి సంబంధించిన అన్ని షోలను క్యాన్సిల్ చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కల్చరల్, పొలిటికల్ వర్గాలకు సంబంధముంది. దీని వల్ల ప్రేక్షకుల భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులు, ఉద్యోగుల భద్రత మా ప్రథమ కర్తవ్యం. అందుకే ఓజీ సినిమాని ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నాం. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న ప్రేక్షకులకు పూర్తి రీఫండ్ ఇవ్వబడుతుంది.

నార్త్ అమెరికా ఓజీ డిస్ట్రిబ్యూటర్‌ తరఫు వ్యక్తులు కొందరు.. గతంలో టికెట్ సేల్స్ సంఖ్యను ఎక్కువ చేసి చూపించమని రిక్వెస్ట్ చేశారు. భవిష్యత్ లో విడుదలయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచేందుకు వారు ఇలా చేస్తున్నారు. నార్త్ అమెరికాలోని సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై పూర్తి ఆధిపత్యం కోసం ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా, వీరు దక్షిణాసియా సమాజాల్లో సామాజిక స్థితి మరియు రాజకీయ అనుబంధాల ఆధారంగా విభజన సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు మేము పూర్తి వ్యతిరేకం." అంటూ యార్క్ సినిమాస్ సంచలన ప్రెస్ నోట్ విడుదల చేసింది.

యార్క్ సినిమాస్ చేసిన ఈ ఆరోపణలపై ప్రత్యంగిరా సినిమాస్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.