English | Telugu

హైకోర్టు సంచలన ఆదేశాలు.. ఓజీ, కాంతార సినిమాల పరిస్థితి ఏంటి?

కర్ణాటకలో సినిమా టికెట్ ధరలను రూ.200కి పరిమితం చేసే నిబంధనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన వల్ల భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ.. ప్రొడ్యూసర్‌లు మరియు మల్టీప్లెక్స్ యజమానులు కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు, తాత్కాలికంగా ఈ నిబంధనను నిలిపివేసింది హైకోర్టు. త్వరలో విడుదల కానున్న బడా సినిమాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.

సినిమాని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది ఉద్దేశంతోనే టికెట్ ధరల నిబంధనను తీసుకొచ్చినట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ నిబంధన వల్ల భారీ బడ్జెట్ సినిమాలు నష్టపోతాయని, భారీ సినిమాలు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని.. ప్రొడ్యూసర్‌లు, మల్టీప్లెక్స్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై కర్ణాటక హైకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

టికెట్ ధరలను రూ.200కి పరిమితం చేసే నిబంధనను హైకోర్టు తాత్కాలికంగా నిలిపి వేయడం.. రిలీజ్ కి రెడీ అయిన 'ఓజీ', 'కాంతార చాప్టర్ 1' వంటి సినిమాలకు రిలీఫ్ అని చెప్పొచ్చు. తెలుగు స్టార్స్ కి కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న 'ఓజీ'పై టికెట్ రేట్ ప్రభావం పడుంటే.. కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇక అక్టోబర్ 2న కన్నడ బిగ్ మూవీ 'కాంతార చాప్టర్ 1' విడుదలవుతోంది. ఈ సినిమాకి రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టే సత్తా ఉందని అందరూ నమ్ముతున్నారు. అయితే ప్రభత్వం తెచ్చిన టికెట్ రేట్ నిబంధన వల్ల.. కర్ణాటకలో కలెక్షన్లకు తీవ్ర గండి పడుతుందని 'కాంతార' నిర్మాతలు ఆందోళన చెందారు. ఇప్పుడు హైకోర్టు స్టేతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.