English | Telugu

"మంత్రిగారి వియ్యంకుడు" రీమేక్ లో రవితేజ

"మంత్రిగారి వియ్యంకుడు" రీమేక్ లో రవితేజ హీరోగా నటించనున్నాడట. గతంలో గ్రేట్ క్రియేటర్ బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు వ్రాయగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా, పూర్ణమా జయరాం హీరోయిన్ గా, జయకృష్ణ నిర్మించిన సూపర్ హిట్ విభిన్నకథా చిత్రం "మంత్రిగారి వియ్యంకుడు". ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలనే ఆలోచన బాపు-రమణ గార్లకు వచ్చిందట. ముళ్ళపూడి వెంకటరమణ గారి కొడుకు వర ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలనుకున్నారట.

అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారా అనుకున్నప్పుడు రవితేజ తాను నటిస్తానని అన్నారట. కానీ ముళ్ళపూడి వెంకట రమణ గారు స్వర్గస్తులవటం వల్ల ఈ సినిమా ఆలస్యమయ్యిందని సమాచారం. ప్రస్తుతం ఈ "మంత్రిగారి వియ్యంకుడు"చిత్రం రీమేక్ త్వరలో సెట్స్ మీదకు రానుందనీ, గతంలో "సారాయి వీర్రాజు" చిత్రాన్ని నిర్మించిన నిర్మాతే ఈ "మంత్రిగారి వియ్యంకుడు" రీమేక్ చిత్రాన్ని కూడా నిర్మిస్తారని తెలిసింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.