English | Telugu

రేపు సెన్సారు కానున్నయన్ టి ఆర్ "శక్తి"

రేపు సెన్సారు కానున్నయన్ టి ఆర్ "శక్తి". వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యన్‍ టి ఆర్‍ హీరోగా, ఇలియానా, మంజరి ఫడ్నిస్ హీరోయిన్లుగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం"శక్తి". ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై, చక్కని ప్రేక్షకాదరణ పొందుతూంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం రేపు అంటే మార్చ్24 వ తేదీన సెన్సారుకి వెళ్ళనుంది.

ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి సెన్సారు వారు "ఎ"సర్టిఫికేట్ ఇస్తారో..., లేక "యు" సర్టిఫికేట్ ఇస్తారో....లేక "యు/ఎ" సర్టిఫికేట్ ఇస్తారో రేపు ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం సెన్సారు పూర్తయ్యాక కానీ తెలియదు. ఈ చిత్రమ శక్తి పీఠాలకు సంబంధించిన కథతో నిర్మించబడిందన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ చిత్రం మీద అటు యన్ టి ఆర్ అభిమానుల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.