English | Telugu

ఓటీటీలో 'మంగళవారం' సందడి!

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'మంగళవారం'. 'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ నవంబరు 17న థియేటర్లలో విడుదలై మంచి స్పందనే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'మంగళవారం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీ వేదిక ఆహా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఓటీటీలోకి వస్తుంది అన్నమాట. మరి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.