English | Telugu
మోహన్ బాబు పోటుగాడు పోలీసయ్యాడు
Updated : Nov 17, 2013
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లలో మంచు విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, ప్రణీత, హన్సికలు కథానాయికలుగా నటిస్తున్నారు. మనోజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నాడు. మీరు చూస్తున్న ఈ ఫోటో ఈ చిత్రంలోనిదే. మరి మిగత హీరోలు ఏయే పాత్రలలో నటిస్తున్నారో త్వరలోనే తెలియనున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.