English | Telugu
శివారెడ్డితో గొడవ పడి పీక పట్టుకున్న మంచు మనోజ్
Updated : Mar 2, 2016
హాస్యనటుడు శివారెడ్డికి, మంచు మనోజ్ కు గొడవైంది. కోపంలో మనోజ్ శివారెడ్డి పీక పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అసలు ఇద్దరికీ మధ్య గొడవేంటి..? ఏం జరిగుంటుంది..? చివరికి ఏమైంది అనుకుంటున్నారా..? ఏం లేదు లెండి..మంచు మనోజ్ నటించిన శౌర్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మనోజ్ శివారెడ్డి పీక పట్టుకున్నట్లు వేళాకోళమాడాడు. దానికి శివారెడ్డి కూడా, నాలుక బయటపెట్టి రెస్పాన్స్ ఇచ్చాడు. గతంలో కూడా సరదాకి, కమెడియన్ ధనరాజ్ ను మనోజ్ భయపెట్టిన సంగతి తెలిసిందే.
చాలా సరదాగా ఉంటాడని మనోజ్ కు ఇండస్ట్రీలో పేరుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందర్నీ ఆటపట్టిస్తుంటాడు. లేటెస్ట్ గా మనోజ్ నటించిన థ్రిల్లర్ సినిమా శౌర్య ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. చాలా కాలం తర్వాత, మనోజ్ క్లాస్ గా ఉండే పాత్రలో నటించాడు. మిస్టర్ ఫర్ ఫెక్ట్ తీసిన దశరథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రెజీనా మనోజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.