English | Telugu
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా..?
Updated : Mar 2, 2016
గతేడాది తెలుగురాష్ట్రాలతో పాటు, యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించింది బాహుబలి సినిమా. తెలుగు సినిమా స్టామినా ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. గత కొద్ది కాలంగా, బాహుబలికి వచ్చినంత పబ్లిసిటీ, బహుశా మరే సినిమాకూ రాలేదేమో. ఆ పబ్లిసిటీలో సగం క్రిడిట్, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకే ఇవచ్చు. ఇది ఇండియా వైడ్ ట్రెండింగ్ లో నిలిచిన కొచన్. తాజగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే దిశగా, జక్కన్న రాజమౌళి తన పనులు వేగవంతం చేశాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి కి మరో భాగం రానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించిన జక్కన్న ప్లాన్ ఇప్పుడు లేట్ అయ్యేలా ఉంది. షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత కూడా ఏవో మార్పులు చేర్పులు చేయడం రాజమౌళికి అలవాటు. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నా, జక్కన్నకున్న చెక్కే అలవాటు కారణంగా సినిమా రిలీజ్ ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాది వేసవికి వెళ్లిపోయింది.
రెండో పార్ట్ కు ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా, గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయి. దీంతో మూవీ రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 14, 2017గా ఫిక్స్ చేసింది మూవీ టీం. అఫీషియల్ గా ప్రకటించకపోయినా, బాలీవుడ్ వర్గాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మొదటి పార్ట్ కు ఇండియా వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్లు విడివిడిగా రిలీజ్ చేసిన జక్కన్న, రెండో పార్ట్ కు మాత్రం, అన్ని చోట్లా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయక తప్పదేమో..