English | Telugu
బాలయ్య వందో సినిమాలో ఆ ముగ్గురు..?
Updated : Mar 2, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. ప్రయోగాలకు తాను వెనకాడనని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు బాలయ్య. అందుకే ఆయన వందో సినిమా గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది .ఇప్పటికే బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాసరావుల పేర్లు తెరపైకి వచ్చినా, బాలకృష్ణ మాత్రం కృష్ణవంశీతో సినిమాకే మొగ్గు చూపారు. బాలయ్యకు పల్లెటూరి వాతావరణం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు నప్పేలా కృష్ణవంశీ రైతు కథను తయారుచేశారట. కథ నచ్చడంతో, వంశీకి బాలయ్య పచ్చజెండా ఊపేశారు.
తాజా సమాచారం మేరకు వందో సినిమాలో తారకరత్న విలన్ పాత్రలో కనిపించనున్నాడట. నారా రోహిత్, మోక్షజ్న కూడా కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. వీరిద్దరి పాత్రల్ని కృష్ణవంశీ చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా, ఫ్యామిలీ ఎమోషన్లతో మంగమ్మగారి మనవడు తరహా చిత్రాన్ని కృష్ణవంశీ మళ్లీ గుర్తు చేస్తారంటున్నారు బాలయ్య అభిమానులు. ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నందమూరి అభిమానుల దృష్టంతా మోక్షజ్నను ఎలా చూపించబోతున్నారనే దానిపైనే ఉంది. మరి కృష్ణవంశీ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి..