English | Telugu

మహేష్ బాబు ఉగాది స్పెషల్ టీజర్

మహేష్ బ్రహ్మోత్సవంకు సంబంధించి చిన్న సాంగ్ టీజర్ తప్ప, ఇప్పటి వరకూ ఇంకే డిటెయిల్స్ రిలీజ్ చేయలేదు మూవీ టీం. దీంతో సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. సమ్మర్ హీట్ లో కూల్ మూవీగా దీన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపే అభిమానులకు ఏదోక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న మూవీ టీం అందుకు ఉగాదిని వేదికగా చేసుకుంది. ఏప్రిల్ 8న ఉగాది సందర్భంగా, ఒక స్పెషల్ టీజర్ ను ఆ రోజు రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి పీల్ గుడ్ మూవీ తర్వాత, మహేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ కావడం, బ్రహ్మోత్సవం అని చక్కటి తెలుగు టైటిల్ పెట్టడం అన్నీ కలిసి ఈ మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. దాంతో ప్రిన్స్ ఫ్యాన్స్ అందరూ ఆ రోజు కోసం ఎదురుచూపుల్లో పడ్డారు. బ్రహ్మోత్సవం టీజర్ రిలీజ్ తో పాటు సర్దార్ మూవీ రిలీజ్ కూడా అదే రోజు కావడం కొసమెరుపు. మహేష్ టీజర్, పవన్ సినిమా రెండూ హిట్టయితే, టాలీవుడ్ కు పండగే. పివిపి సంస్థ భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.