English | Telugu

పెదరాయుడు దోశ రూ.100 మాత్రమే..

మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా బిరుదు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఇడ్లీలమ్మి కలెక్షన్ లెక్క చూసుకున్నారు. తన శ్రీవిద్యానికేతన్ లోనే ఇడ్లీలను స్టాఫ్ కు, పిల్లలకు, కస్టమర్లకు అమ్మారు. విషయంలోకి వెళ్తే, మంచు లక్ష్మి మేము సైతం అనే షో ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ, రకుల్ ప్రీత్, రానా, శ్రియ లాంటి వాళ్లందరి చేతా పనులు చేయించి, వచ్చిన డబ్బును ఛారిటీకి ఉపయోగించిన లక్ష్మి కన్ను ఈ సారి తన తండ్రిపైనే పడింది. కూతురి కోరిక మేరకు, మోహన్ బాబు తన క్యాంపస్ లోనే ఇడ్లీలు అమ్మారు.

పెదరాయుడు మసాలా దోశ, అసెంబ్లీ రౌడీ ఇడ్లీ, అల్లుడు గారు పూరి అంటూ మోహన్ బాబు సినిమాల పేర్లను, ఐటెమ్స్ కు పెట్టడం విశేషం. మొదటి ప్లేట్ ను శ్రీవిద్యానికేతన్ లోని ఫ్యాకల్టీ దామోదరం దంపతులు కొనుక్కున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును శ్రీకాళహస్తిలో ఆటో డ్రైవర్ గా, హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మస్తానయ్య అనే అతనికి ఇవ్వబోతున్నారు. మొన్ననే తన పుట్టిన రోజుకు స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇమ్మని కోరిన మోహన్ బాబు, ఇప్పుడు ఇలా ఇడ్లీలు అమ్మి ఛారిటీ కోసం పనిచేయడంతో, ఆయనది ఎంత మంచి మనసో అంటున్నారు మంచు కుటుంబ అభిమానులు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.