English | Telugu

నేనే నటసామ్రాట్ అంటున్న ప్రకాష్ రాజ్

టాలీవుడ్ లో నటసామ్రాట్ అన్న పదం చాలా బరువైంది. విలువైనది కూడా. ఎందుకంటే ఆ బిరుదు అక్కినేని నాగేశ్వరరావు గారిది. తిరుగులేని నటనా చక్రవర్తిగా ఇండస్ట్రీని ఏలి, చివరి శ్వాస వరకూ నటనే జీవితంగా గడిపిన అక్కినేని వారి పేరు ముందు చేరి నటసామ్రాట్ బిరుదు ఎనలేని విలువను సొంతం చేసుకుంది. తాజాగా ఆ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.

మరాఠీలో, మహేష్ మంజ్రేకర్ డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్టయింది నటసామ్రాట్. నానా పటేకర్ ఇందులో లీడ్ రోల్ చేశారు. యాక్టర్ గా ఒక వెలుగు వెలిగి, రిటైరైన ఒక నటుడిపై తన నట ప్రయాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, రిటైరైన తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని ఇప్పుడు సౌత్ ఇండియా భాషల్లో రీమేక్ చేయాలనుకుంటున్నాడు ప్రకాష్ రాజ్. గతంలో ప్రకాష్ తీసిన రీమేక్ సినిమా ధోని మాతృక కూడా మహేష్ మంజ్రేకర్ సినిమాయే కావడం విశేషం. తన సొంత నిర్మాణ సంస్థలో, తానే నటిస్తూ, దర్శకత్వం చేస్తూ నటసామ్రాట్ ను ఆవిష్కరించబోతున్నాడని సమాచారం. కానీ మరాఠీ వాళ్లకు అక్కినేని బిరుదుతో సంబంధం లేదు కాబట్టి పర్లేదు. మరి టాలీవుడ్ లో కూడా అదే టైటిల్ ను ప్రకాష్ పెడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.