English | Telugu
జనతా గ్యారేజ్ తో మోహన్ లాల్ కు నాలుగు కోట్లు
Updated : Mar 22, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా తమిళ, మళయాళ భాషల్లో కూడా రిలీజవుతోంది. సూపర్ స్టార్ కావడంతో, మోహన్ లాల్ రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. దానికి ప్రతిగా, నిర్మాతలు మోహన్ లాల్ కు కోటిన్నర రెమ్యునరేషన్ ఇచ్చి, మళయాళ రైట్స్ ఇచ్చేశారట.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ మోహన్ లాల్ ఈ రైట్స్ ను అద్భుతంగా క్యాష్ చేసుకుని మూవీ టీం కే కళ్లు తిరిగే షాక్ ఇఛ్చారు. మళయాళంలో జనతా గ్యారేజ్ రైట్స్ ను నాలుగు కోట్లకు బిజినెస్ చేయించి, అందరి నోళ్లూ తెరిపించారు మోహన్ లాల్. అక్కడ ఆయనకు క్రేజ్ భారీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే జనతా గ్యారేజ్ ఆయన సినిమాయే అన్నంతగా ప్రచారం చేయించడంతో, జనతాగ్యారేజ్ కు ఈ స్థాయి డిమాండ్ పలికిందని సమాచారం. జనతా గ్యారేజ్ కేరళలో సూపర్ హిట్టయ్యిందంటే, అక్కడ ఎన్టీఆర్ మార్కెట్ మరింత విస్తృతమవుతుందనడంలో డౌట్ లేదు. నాన్నకు ప్రేమతో లో గడ్డంతో లుక్ మార్చిన ఎన్టీఆర్, ఈ సినిమా కోసం మరో కొత్త లుక్ ట్రై చేస్తున్నాడని సమాచారం.